Devotional

ఈ రాశివారు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది- రాశిఫలాలు

ఈ రాశివారు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది- రాశిఫలాలు

మేషం

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో లాభాల బాటపడతారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. అశ్విని, భరణి నక్షత్రాల వారికి సమయం అనుకూలంగా ఉంది.

వృషభం

వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడులు పెంచడానికి ఇది సమయం కాదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజ నకంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది. బంధు మిత్రులు మీ సలహాలు స్వీకరించి లాభపడతారు. కృత్తిక నక్షత్రం వారు బాగా లాభపడే అవకాశం ఉంది.

మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితుల ఉంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు అంచనాలకు మించి సఫలం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుకుంటారు. పునర్వసు నక్షత్రం వారికి కలిసి వస్తుంది.

కర్కాటకం

ఉద్యోగులకు ఆశించిన హోదాలు దక్కే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవ హారాలు సఫలం అవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. పుష్యమి వారు ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందు తారు.

సింహం

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు, ఆలస్యాలు లేకుండా పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయపడడం జరుగుతుంది. ఉద్యోగంలో సాను కూల వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసు కుంటుంది. పుబ్బ వారికి ఆకస్మిక ధన లాభం ఉంది.

కన్య

ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినప్పటికీ, వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. ఉత్తరా నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది.

తుల

ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగి పోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలు సంద ర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. స్వాతి నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందు తుంది.

వృశ్చికం

పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఒక శుభ పరి ణామం చోటు చేసుకుంటుంది. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. సతీమణితో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. జ్యేష్టా నక్షత్రం వారు ఆశించిన శుభవార్త వింటారు.

ధనుస్సు

నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. మంచి ఆపర్లు అంది వస్తాయి. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. దాదాపు ప్రతి ప్రయ త్నమూ సఫలం అవుతుంది. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.

మకరం

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతి విష యంలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సోదర వర్గంలో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం

ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. పూర్వాభాద్ర నక్షత్రంవారు మరింతగా శుభ ఫలితాలు పొందుతారు.

మీనం

ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో శ్రమాధిక్యత కనిపిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారం అయి ప్రయోజనం పొందుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుం టారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనారోగ్య సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం పొందు తారు. ఉద్యోగ, ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z