ఢిల్లీ లిక్కర్ కేసులో నాలుగోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. విచారణకు రాలేనంటూ ఆమె ఈడీకి మెయిల్ పంపారు. ఈ నేపథ్యంలో ఈడీ యాక్షన్ ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి నెలకొంది.
లిక్కర్ కేసులో ఇవాళ(మంగళవారం, జనవరి 16న) ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు పంపించింది. అయితే సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని.. తన కేసు ఇంకా సుప్రీంలో పెండింగ్‌లో ఉందని లేఖలో పేర్కొన్న కవిత.. కాబట్టి తాను విచారణకు రాలేనని మెయిల్ ద్వారా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించనుందో స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. గతంలో మూడు సార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడీ విచారణ సమయంలో కవిత అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను విచారించిన ఈడీ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.
👉 – Please join our whatsapp channel here –