DailyDose

అమిత్ షా ఇంట్లో తీవ్ర విషాదం-తాజా వార్తలు

అమిత్ షా ఇంట్లో తీవ్ర విషాదం-తాజా వార్తలు

* అమిత్ షా ఇంట్లో తీవ్ర విషాదం

సంక్రాంతి పండుగ పూట కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. షా సోదరి రాజేశ్వరి బెన్ అనారోగ్యంతో ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెకు ఇటీవల సర్జరీ చేశారు. కాగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్న ఆమె.. ఈ రోజు ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. దీంతో అమిషా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పండుగ కావడంతో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన హోం మంత్రి హుటాహుటిని తన ఈవెంట్లను రద్దు చేసుకుని ముంబైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో జరగాల్సిన రెండు బహిరంగ కార్యక్రమాలను షా పాల్గోనడం లేదు.

* శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్న జగన్

రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్‌ బయలుదేరనున్నారు. పన్నెండున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.15కు సీఎం జగన్‌ గోరంట్ల మండలం పాలసముద్రం చేరుకోనున్నారు. మూడు గంటల 10 నిమిషాలకు ప్రధానమంత్రికి సీఎం ఘన స్వాగతం పలకనున్నారు. ప్రధాని, గవర్నర్‌తో కలిసి నాసిన్ – నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సాయంత్రం ఏడున్నరకు తిరిగి తాడేపల్లికి సీఎం జగన్ చేరుకోనున్నారు.ప్రధాన పర్యటన షెడ్యూల్‌..రేపు(జనవరి 16) ప్రధాని నరేంద్ర మోడీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి చేరుకుంటారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ సెంటర్‌ను సందర్శిస్తారు. ఇక్కడి కొనసాగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ డిటెక్షన్‌ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగిస్తారు ప్రధాని మోడీ. అనంతరం ఢిల్లీకి ప్రయాణమవుతారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి శనివారం జిల్లా అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని సూచించారు.

* పండగ పూట ప్రచారం కలిసి వచ్చేలా స్కెచ్!

సంక్రాంతి పండగ వచ్చిందంటే ఆ సరదాలే వేరు. చిన్నాపెద్ద తేడాలేకుండా అందరూ పతంగులు ఎగరవేస్తూ సరదాగా సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు. ప్రజలంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుంటే రాజకీయ పార్టీలు మాత్రం పొలిటికల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చిన సంక్రాంతి కావడంతో కైట్ ఫెస్టివల్ వద్ద ప్రధాన పార్టీల పాటలు పోటాపోటీగా వినిపిస్తున్నాయి. దీంతో యువత అంతా పతంగులు ఎగురవేస్తుంటే పార్టీలు మాత్రం ప్రచారానికి ఈ ఫెస్టివల్‌ను ఉపయోగించుకుంటున్నాయనే టాక్ వినిపిస్తోంది.గ్రామాల్లో అందరూ ఒక చోట చేసి పతంగులు ఎగరవేస్తుంటే పట్టణాల్లో యువత అంతా బిల్డింగ్‌లపై చేరి హోరెత్తించే మ్యూజిక్ నడుమ కైట్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లోకల్ లీడర్లంతా ఈ పతంగుల పండగను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. పండగ పూట ప్రజలంతా ఇళ్లలోనే ఉండగా, యువత అంతా కైట్స్ సెలబ్రేషన్స్ కోసం బిల్డింగ్‌లపై ఉంది. ఈ సమయంలో పండగ పూట పార్లమెంట్ ప్రచారం కలిసి వచ్చేలా లీడర్లు ప్లాన్ చేశారు. తమ తమ పార్టీ ప్రచార పాటలను ప్లే చేయిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాటలు జోరుగా వినిపిస్తున్నాయి.దీంతో ప్రచారానికి పండగను సైతం వదలడంలేదనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులంతా సంక్రాంతి ఫెస్టివల్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గ్రామాణ ప్రాంతాల్లో దావత్‌లు, కైట్ సెలబ్రెషన్స్‌కు ఏర్పాట్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

* సన్యాసం తీసుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ యువతి

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి ఆధ్యాత్మిక బాటలో నడిచి సన్యాసిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని కుమార్‌పేట్‌కు చెందిన ట్వింకల్‌ కామ్‌దార్‌ జైనమత సన్యాసం స్వీకరించనున్నారు. ఆమె స్థానికంగా ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేసి, అక్కడే ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.29 ఏండ్ల ట్వింకల్‌ కామ్‌దార్‌ 2007 నుంచి జైన మతగురువు రామ్‌లాల్‌ జీ బోధనలు వింటున్నది. అందుకు ఆకర్షితులై సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సంప్రదాయబద్ధంగా చందన మండల పూజాక్రతువును ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఆదిలాబాద్‌ పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.భారీ సంఖ్యలో భక్తులు, జైనమతస్థులు హాజరు కాగా.. భక్తిగీతాలతో ప్రధాన వీధులు మార్మోగాయి. ఈ నెల 22న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జావుదాలో దీక్షా మహోత్సవం సందర్భంగా జైనమత సన్యాసాన్ని స్వీకరించనున్నట్టు ట్వింకల్‌ కామ్‌దార్‌ తెలిపారు. ఆమె తల్లి శ్వేత కామ్‌దార్‌, తండ్రి గిరీశ్‌ భాయ్‌ కామ్‌దార్‌ కొన్నేండ్ల క్రితం చనిపోయారు.

* భరోసా ఇచ్చిన మంత్రి

గత కొద్ది నెలలుగా పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మాంద్యం కారణంగా తీవ్ర నష్టాల పాలయ్యింది. దీని కారణంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తులు పెరిగి గోదాముల్లో నిలువలు పెరుకుకుపోయాయి. దీంతో పాటు హైదరబాద్ తదితర మార్కెట్లలో ఫాలిస్టర్ వస్త్రాల అమ్మకాలు తగ్గిపోవడంతో కార్మికులకు, వస్త్ర పరిశ్రమ అనుబంధ సభ్యులకు పని కల్పించలేక, సకాలంలో జీతాలు అందించలేక 15వ తేదీ నుండి ఫ్యాక్టరీలను మూసి వేయాలని తలంచారు..ఈ విషయాన్ని అధికారులు రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకరాగ కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో వెంటనే స్పందించి, ప్రభుత్వం ద్వారా అర్వియం ఆర్డర్లు మాక్స్ &SSI యూనిట్స్ ద్వారా నేత కార్మికులకు త్వరోలోనే ఇచ్చేవిధంగా సంబంధిత అధికారులను ఆదేశించారు.అంతే కాకుండా.. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యలతో పాటు ఇతర పరిశ్రమలు ఎదుర్కుంటున్న సమస్యలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర చేనేత విభాగం డైరెక్టర్ అలుగు వర్షిణి, రీజినల్ డైరక్టర్ అశోక్ రావును ఆదేశించారు.

* పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ బిగ్ స్కెచ్

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించడంపై బీజేపీ కసరత్తు చేస్తున్నది. వికసిత్ భారత్ అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంపై దృష్టిసారిస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. అయినా ప్రజల నుంచి అనుకున్నంత స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో అయోధ్య రాముడి జపం చేస్తోంది. రామా.. నువ్వే దిక్కు అని అంటున్నది. తెలంగాణలో ఎంపీ ఎన్నికల భారాన్ని బీజేపీ పూర్తిగా రాముడిపైనే వేసింది. రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అస్త్రంగా మార్చుకుంటోంది. ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. ఒక వైపు రామ జపం.. మరో వైపు మోడీ నామస్మరణతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది.పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి ప్రధాని కావాలని మోడీ చూస్తున్నారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఏ ఒక్క అంశాన్ని వదులుకోవద్దని, అది పార్టీకి మైలేజ్ ఇస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే కొన్ని రోజులుగా కాషాయ దళం పూర్తిగా రామ జపం చేస్తోంది. దీనికి తోడు మోడీ చరిష్మా పార్టీకి ప్లస్ అవుతుందనే భావనలో నేతలున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో కేవలం 4 పార్లమెంట్ స్థానాలకే బీజేపీ పరిమితమైంది. కాగా ఈసారి డబుల్ డిజిట్‌పై హైకమాండ్ కన్నేసింది. అందుకోసం రామ జపంతో పాటు మోడీ చరిష్మాను వినియోగించుకోవాలని చూస్తోంది.ఈనెల 22వ తేదీన రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికీ అయోధ్య అక్షింతలు అందించే పనిని కమలం పార్టీ పెట్టుకుంది. విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు దీనికోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాగే ఈనెల 22న రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని శుద్ధి చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. అలాగే ప్రతి ఆలయం వద్ద రాముడి ప్రాణ ప్రతిష్టను ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి వీక్షించేలా చేయాలని ప్లాన్ చేస్తున్నది.అలాగే ప్రతి ఇంట్లో ఐదు దీపాలతో రాముడికి దీపారాధన చేపట్టాలని కమలనాథులు కోరుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రవ్యాప్తంగా కుదిరితే పార్లమెంట్ల వారీగా ప్రజలకు అయోధ్య రాముడి దర్శనార్థం ఉచితంగా రైళ్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 22న రాష్ట్రం నుంచి ఉచిత రైలు బయలుదేరనుంది. మరి రాముడి ప్రాణ ప్రతిష్టతో మోడీ ప్రతిష్ట పెరుగుతుందా..? ఆ ప్రభావం తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై చూపుతుందా..? అనేది వేచి చూడాలి.

* చివరి శ్వాస వరకూ తెదేపాలోనే

ఓటమి భయంతో వైకాపా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని తెదేపా సీనియర్‌ నేత, పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. ‘‘తెదేపా ఆవిర్భావం నుంచి మా కుటుంబం ఆ పార్టీలోనే ఉంది. గురజాల నుంచి అనేక సార్లు పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చింది. చివరి శ్వాస వరకూ ఈ పార్టీలోనే కొనసాగుతా. ఇప్పటికైనా వైకాపా సోషల్‌ మీడియా ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలి’’ అని యరపతినేని అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z