అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ మొదటి విజయం దక్కింది. అయోవాలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ట్రంప్ మెజారిటీ ఓట్లను సాధించారు. నిక్కీ హైలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్లను వెనక్కి నెట్టి ట్రంప్ ముందు వరుసకు చేరుకున్నారు.
అయోవాలో నిన్న జరిగిన పోలింగ్‌లో భారీ స్థాయిలో ప్రజలు పాల్గొన్నారు. 1600 పోలింగ్ కేంద్రాల్లో జనం ఉత్సాహంగా ఓట్లు వేశారు. స్థానిక కాలమానం ప్రకారం నిన్న రాత్రి 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయోవాలో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్‌కు ఈ ఫలితం శుభసూచకంగా మారింది.
అమెరికా అధ్యక్షున్ని ఎన్నికునే ప్రక్రియలో అయోవాకు రెండు శాతం కంటే తక్కువ ఓటింగ్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్‌పైనే పూర్తి విజయం ఆధారపడి ఉంటుంది. న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినాలో ట్రంప్‌కు విజయం తప్పకుండా అవసరమైతుంది.
👉 – Please join our whatsapp channel here –