తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సంక్రాంతి పర్వదినం, ఆపై సోమవారం కావడంతో పాటు మేడారం జాతరకు ముందు రాజన్నకే తొలి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తుండటంతో ఆలయానికి పోటెత్తారు. కల్యాణకట్ట, ధర్మగుండం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా భక్తులు కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, స్నానాలు ఆచరించిన అనంతరం.. స్వామివారికి కోడె మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఆ తర్వాత రాజన్నను దర్శించుకుంటున్నారు. సమీపంలోని బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలిరావడంతో ఆలయం కిక్కిరిసి పోయింది. మేడారం జాతర నేపథ్యంలో దుకాణాల్లో ఎత్తు బంగారం (బెల్లం) కొనుగోళ్లతో వేములవాడ భక్తజనసందోహం మారింది.
👉 – Please join our whatsapp channel here –