‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) టెక్నాలజీ.. మారుతున్న భౌగోళిక పరిస్థితులు దాదాపు ప్రపంచంలోని సగం వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని దిగ్గజ కంపెనీల సీఈఓలు ఆందోళన చెందుతున్నారు.
ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC) సర్వ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4,702 కంపెనీల నాయకుల పోల్‌లో 45 శాతం మంది తమ వ్యాపారాలు అనుకూలించకపోతే 10 సంవత్సరాలలో విఫలమవుతారని తెలిపింది. 2023లో కొన్ని కంపెనీల పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న సంఘటనలు ఇప్పటికే కళ్ళముందు కనిపించాయని స్పష్టం చేసింది.
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పీడబ్ల్యుసీ గ్లోబల్ చైర్మన్ ‘బాబ్ మోరిట్జ్’ (Bob Moritz) మాట్లాడుతూ.. ఆదాయ అవకాశాలు గత ఏడాది కంటే ఈ ఏడాది తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఉద్యోగులను తొలగించి ఏఐ వినియోగాన్ని పెంచుకోవడానికి కూడా సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.
టెక్నాలజీ మాత్రమే కాకుండా మారుతున్న భౌగోళిక పరిస్థితులు కూడా కంపెనీల వృద్ధికి అడ్డుకట్ట వేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడుల వంటివి ప్రపంచ వాణిజ్యానికి అంతరాయాలుగా ఉన్నాయి.
👉 – Please join our whatsapp channel here –