* ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈమేరకు వారిద్దరికీ పార్టీ అధిష్ఠానం సమాచారమిచ్చింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 18 చివరి తేదీ. 29న ఎన్నికలు జరగనున్నాయి.
* నా ప్రయాణం టీడీపీ వెంటే
వంగవీటి మోహనరంగ ఆ పేరులోనే ఏదో తెలియని ఆకర్షణ. ఆయన ఈ లోకాన్ని విడిచి మూడు దశాబ్ధాలు గడుస్తున్న ప్రజల్లో ఆయన నింపిన స్ఫూర్తి ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. బెజవాడలో ఇప్పటికీ ఏదో మూల వంగవీటి మోహన్ రంగా పేరు చెవుల్లో మారుమోగుతుంది. కాపు కుల నాయకుడిగా ముద్రపడినా ఆయన అన్ని సమాజిక వర్గాలకు సమానుడే. ఇక వెనుకబడిన వర్గాలకు ఆయన ఓ దేవుడు. అందుకే చనిపోయినా.. అమరుడైనా ప్రజల గుండెల్లో నిలిచాడు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన కొడుకు వంగవీటి రాధకృష్ణ మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అచ్చం తండ్రిలాగే ఆయన ఆశయాలను పునికిపుచ్చుకున్నాడు.అది అంటుంచితే, ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత కొన్ని రోజులగా రాధా టీడీపీ నుంచి వైసీపీకి వెళ్తారనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఆ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన ప్రయాణం టీడీపీ వెంటేనని స్పష్టం చేశారు. ఎవడో పుట్టించిన గాలి వార్తలను ప్రజలు నమ్మొద్దని, ఒక వేళ ఎవడైనా అలా వార్తలు ప్రచారం చేస్తే వారిని నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించే శక్తి కేవలం టీడీపీకి మాత్రమే ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రం బాగుపడాలంటే ప్రజలంతా టీడీపీ, జనసేన కూటమిని బలపరచాలని స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.
* తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు వచ్చింది. ఖమ్మంలో ఉండగా ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో మొదట ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
* కేసీఆర్‌కు బిగ్ షాక్
ఒడిశా మాజీ సీఎం, తొమ్మిదిసార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ రేపు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఆయనతో పాటు భార్య (మాజీ ఎంపీ) హేమా గమాంగ్, కుమారుడు శిశిర్ గమాంగ్, మాజీ ఎంపీ సంజయ్ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఢిల్లీలో పార్టీలో లాంఛనంగా చేరనున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అజయ్ కుమార్‌తో ప్రాథమిక చర్చలు కంప్లీట్ అయ్యాయి.ఒకేసారి నలుగురూ కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్‌లో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కొనసాగినా 2015లో బీజేపీలో చేరి గతేడాది జనవరి 25న రిజైన్ చేసి రెండు రోజుల తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యవహారాలను చూస్తున్నారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గమాంగ్ ఫ్యామిలీ మరో నాలుగు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. బీఆర్ఎస్‌లో చేరి ఏడాది కూడా కాకముందే వీరు పార్టీని వీడుతున్నారు.టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చి వివిధ రాష్ట్రాల్లో విస్తరింపజేయాలని భావించినా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం పార్టీపైన పడింది. ఒడిశాలో విస్తరణ సంగతేమోగానీ రాష్ట్రంలోనే బలోపేతం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న గిరిధర్ గమాంగ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఒడిశాలో ఆయన మీద ఆశలు పెట్టుకుని పార్టీని ఎక్స్ పాండ్ చేయాలనుకున్న కేసీఆర్‌కు తాజా పరిణామంతో ఊహించని షాక్ తగిలింది. గతేడాది జనవరి 25న బీజేపీకి రాజీనామాచేసి 27న బీఆర్ఎస్‌లో చేరారు. 2024 జనవరి 17న తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
* ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం పట్ల బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమైన చర్య అని అన్నారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఆంధ్ర నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయలేదని.. తొలగించలేదని దాసోజు శ్రవణ్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీగానీ.. కేసీఆర్ ప్రభుత్వం గానీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపారు. కానీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అని మండిపడ్డారు. జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. విగ్రహం ధ్వంసం చేసిన చోటులో మళ్లీ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర డీజీపీ, సైబరాబాద్ సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లను ఆయన కోరారు.
* తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డిది కీలకపాత్ర
తెలంగాణ ఏర్పాటుకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒప్పించడంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నెక్లెస్‌రోడ్‌లోని స్ఫూర్తి స్థల్ వద్ద జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి కోమటిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ తప్పకుండా వస్తుందని.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని నాయకులు, ఉద్యమకారులకు జైపాల్‌రెడ్డి చెప్పేవారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాబోదని భరోసా ఇచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా పనిచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
👉 – Please join our whatsapp channel here –