కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొననారు. అయితే, అంతకుముందు.. ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అయితే, గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు.. షర్మిల కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే పదవీ త్యాగానికి సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గిడుగు రుద్రరాజు ఏపీ అధ్యక్షుడిగా అందించిన సేవలను అభినందిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –