సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అమెరికాలోని అట్లాంటా నగరంలో స్థానిక ప్రవాసులు ఏకాదశ రుద్రాభిషేక హోమాన్ని నిర్వహించారు. ప్రవాసాంధ్రుడు అక్కినేని ఆనంద్ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ హోమంలో బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవాస యువతుల శాస్త్రీయ నృత్యం ఆకట్టుకుంది. అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకలో ప్రముఖ వైద్యులు డా. మంగరాజు వానపల్లి, డా. తులసి వానపల్లి, డా. కోగంటి దేవందర్ కుమార్, డా. నందినిరెడ్డి, డా. సుధారెడ్డి, దుద్దిళ్ల శ్రీనాథ్, లింగం షీలా, బొర్రా సుధాకర్, ముసునూరు సురేష్, కొసరాజు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
###############
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z