DailyDose

హైదరాబాద్‌లో ఒళ్లు గగుర్పొడిచే మర్డర్- నేర వార్తలు

హైదరాబాద్‌లో ఒళ్లు గగుర్పొడిచే మర్డర్- నేర వార్తలు

* కేజ్రీవాల్‌ సంజ‌య్ సింగ్‌కు ఊర‌ట‌

ప‌రువు న‌ష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఎంపీ సంజ‌య్ సింగ్‌కు సుప్రీంకోర్టు(supreme court)లో ఊర‌ట ల‌భించింది. ప్ర‌ధాని మోదీకి చెందిన డిగ్రీ ప‌ట్టా కేసులో ఆ ఇద్ద‌రూ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు కోర్టులో పిటీష‌న్‌ దాఖ‌లైంది. గుజ‌రాత్‌కు చెందిన గుజ‌రాత్ యూనివ‌ర్సిటీ ఆ పిటీష‌న్ వేసింది. పీఎం మోదీ డిగ్రీ వివ‌రాల‌ను ఆ వ‌ర్సిటీ వెల్ల‌డించ‌లేద‌ని కేజ్రీవాల్‌, సంజ‌య్ సింగ్‌లు ఆరోపించారు. అయితే ఆ ఇద్ద‌రు నేత‌ల‌పై యూనివ‌ర్సిటీ వేసిన కేసులో సుప్రీంకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల వ‌ర‌కు ఆ స్టే అమ‌లులో ఉంటుంద‌ని కోర్టు తెలిపింది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌, సందీప్ మెహ‌తాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆ తీర్పునిచ్చింది. గుజ‌రాత్ కాకుండా మ‌రో రాష్ట్రానికి కేసును బ‌దిలీ చేయాల‌ని సంజ‌య్ సింగ్ అభ్య‌ర్థన పెట్టుకున్నారు. ఆ అప్పీల్‌ను కోర్టు కొట్టిపారేసింది. అడ్వ‌కేట్ అభిశేక్ మ‌నూ సింఘ్వి, వివేక్ జైన్, క‌ర‌న్ శ‌ర్మ‌లు సంజ‌య్ సింగ్ త‌ర‌పున వాదించారు.

* హైదరాబాద్‌లో ఒళ్లు గగుర్పొడిచే మర్డర్

పండుగ వేళ హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ జన్నారం కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయ్ అనే వ్యక్తి తన భార్య పుష్పను కిరాతంగా హత్య చేశాడు. భార్య మొండెం నుండి తలను వేరు చేసి కిరాతకంగా హతమార్చాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడు విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, భార్యను విజయ్ ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.

* ఓ భక్తుడు ఆలయంలో గొంతుకోసుకొని ఆత్మహత్య

ఆలయంలో ఓ భక్తుడు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో కలకలం సృష్టించింది. మహర్‌ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాకు చెందిన లల్లారామ్‌(37)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహర్‌ జిల్లా కేంద్రంలోని ఓ కొండపై శారదా మాతా ఆలయం ఉంది. సోమవారం రాత్రి లల్లారామ్‌ ఒంటిరిగా ఆలయానికి చేరుకున్నాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆలయంలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. అక్కడున్న పరిస్థితుల ఆధారంగా గొంతుకోసుకొని బలవన్మరణం చెందినట్లు నిర్ధరించారు. అయితే ఈ ఘటనను ఎవరూ గమనించలేదని మహర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి అనిమేష్‌ ద్వివేది తెలిపారు. ఆలయంలో అతడు పడిఉన్న కొంచెం దూరంలో కత్తిని గుర్తించామని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.ఈ ఆలయంలో గతంలో కొందరు భక్తులు తమ నాలుకను కోసుకునేందుకు ప్రయత్నించిన సందర్భాలు ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారని స్థానికులు పేర్కొన్నారు.

* అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం

అనుమానం పెనుభూతమైంది. జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా వివాహామాడిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. భార్య తల నరికి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్‌(Abdullahpurmet)లో మంగళవారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. వినయ్‌ అనే వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తలను నరికి(Wife hacked )చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* ఆ రోజు సీఎంను చంపేస్తాం

జనవరి 26న రిపబ్లిక్ డే రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను హతమారుస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాదులు బెదిరించారు. ప్రపంచవ్యాప్తంగా వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న గుర్ పత్వంత్ సింగ్ పన్నూన్.. సీఎం రిపబ్లిక్ డే రోజు జరిగే సీఎం హత్య దాడిలో గ్యాంగ్ స్టర్స్ అందరు ఏకం కావాలనే సందేశంలో ఓ వీడయోను విడుదల చేశాడు. కాగా పన్నూన్ బెదిరింపులు నిజమేనని పంజాబ్ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు గ్యాంగ్ స్టర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు.పన్నూన్ బెదిరింపూలపై స్పందించిన డీజీపీ గౌరవ్.. గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ గ్యాంగ్ స్టర్ పన్నూన్ గతంలో భారతీయ అధికారులను బెదిరించాడు. డిసెంబర్ 13వ తేదీ, అంతకన్నా ముందు భారత పార్లమెంట్‌పై దాడి చేస్తానని వీడియో కూడా విడుదల చేశారు. అలాగే నవంబర్ 19వ తేదీన ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరించారు. ఆ వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కేసు నమోదు చేసింది.

* పండుగపూట జిల్లాలో విషాదం

పండుగపూట జిల్లాలో విషాదం చోటు చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని వలసొచ్చిన ఓ కూలీ అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీ (పవర్ లూమ్స్ కార్మికుడు)(Power Looms worker )(55) ఉరి(Hanging) వేసుకొని ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన తంగళ్లపల్లి మండలం టెక్స్‌ టైల్స్ పార్కు ఇందిరమ్మ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z