ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఫ్లోరిడా టంపాబే విభాగం ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా రెండు మైళ్ల మేర హైవేను శుభ్రపరిచారు. టెంపాలోని ఎస్.ఆర్. 581/బ్రూస్ B డౌన్స్ Blvd రెండు మైళ్ల హైవేను దత్తత తీసుకున్న నాట్స్ 35 మంది నాట్స్ సభ్యులు, స్థానిక హైస్కూల్ విద్యార్ధులతో కలిసి శుభ్రపరిచింది. రహదారికి ఇరువైపులా ఉన్న చెత్త చెదారం తొలగించారు. ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ సేవా ధ్రువ పత్రాలను అందించింది.
నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 సమన్వయకర్త శ్రీనివాస్ గుత్తికొండ, టాంపాబే ఛాప్టర్ సమన్వయకర్త సుమంత్ రామినేని, నాట్స్ ప్రతినిధులు డా. కొత్త శేఖరం, శ్రీనివాస్ మల్లాది, భాను ధూళిపాళ్ల, రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ అరికట్ల, సురేష్ బుజ్జా, విజయ్ కట్ట, శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, శ్రీనివాస్ బైరెడ్డి, అనిల్ అరేమండ, భార్గవ్ మాధవరెడ్డి తదితరులు సహకరించారు. నాట్స్ అధ్యక్షుడు నూతి బాపు నాట్స్ టాంపాబే విభాగానికి సమాజహిత కార్యక్రమాలు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
###############
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z