హిట్ అండ్ రన్‌కి సంబంధించిన సెక్షన్‌ను ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ప్రకటించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో అమలు చేయాల్సి వస్తే డ్రైవర్లు, లారీ యజమానులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అజయ్ భల్లా ఇప్పటికే హామీ ఇచ్చారని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కొన్ని గుర్తింపులేని సంఘాలు బుధవారం నుంచి సమ్మె చేయాలని భావిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. సమ్మె నిర్ణయాన్ని గుర్తింపు పొందిన సంఘాలతో పాటు మెజారిటీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. కొత్త చట్టం రాష్ట్ర పరిధిలోనిది కాదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని పొన్నం తెలిపారు. సమ్మె కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని, ఈ నిర్ణయంపై లారీ డ్రైవర్లు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
👉 – Please join our whatsapp channel here –