ఆంధ్రప్రదేశ్‌లో రూ.541 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
503 ఎకరాల్లో నాసిన్..
శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడి నుంచి గంటలో చేరుకునేంత దూరం ఉండటం కలిసొచ్చే అంశం. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఆవరణలోనే సోలార్ సిస్టం కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని తీసుకొచ్చారు. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
👉 – Please join our whatsapp channel here –