ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2023 ఎన్నికల బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ 18వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 2PMCST/3PMEST/12PMPST గంటల నుండి ప్రారంభం అవుతుందని ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు ఓ ప్రకటనలో తెలిపారు. సియాటెల్‌కు చెందిన Votegrity అనే సంస్థ ద్వారా ఈసారి తానా ఎన్నికలు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. సభ్యుల ఈమెయిల్‌తో పాటు పోస్టల్ శాఖ ద్వారా ఒక కోడ్‌ను పంపించారు. ఈ కోడ్ ద్వారా సభ్యులు తమ ఓటు హక్కును ఆన్‌లైన్‌లో వినియోగించుకున్నారు.
రేపు మధ్యాహ్నం నుండి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అభ్యర్థులకు రేపు ఉదయం జూమ్ కాల్ లింక్ పంపిస్తామని కనకంబాబు వెల్లడించారు. మొత్తం పోలైన ఓట్లు, చెల్లని ఓట్లు వంటి లెక్కలు అన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలోని ముఖ్యాంశాలు
1. 25 ఓట్ల కన్నా తక్కువ మెజార్టీ ఉంటే రీకౌంటింగ్ నిర్వహిస్తారు.
2. ఓట్లు సమానంగా వచ్చిన పక్షంలో నాణేన్ని ఎగురవేసి విజేతను నిర్ణయిస్తారు.
3. తానా వెబ్‌సైట్‌లో ఫలితాలు ఉంచిన 48గంటల లోపు పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైనా $500 తానాకు చెల్లించి తమ ఎన్నికకు సంబంధించి ప్రశ్నించవచ్చు. ఎటువంటి ప్రశ్నలు లేని పక్షంలో బ్యాలెట్లను శాశ్వతంగా ధ్వంసం చేస్తారు.
4. 100 ఓట్లు కన్నా తక్కువ మెజార్టీ వచ్చిన అభ్యర్థులు తమ బ్యాలెట్లను రీకౌంటింగ్‌కు ఫలితాలు వెలువడిన 48గంటల లోపు అభ్యర్థించవచ్చు. దీనికి తానాకు $5000 చెల్లించాలి. రీకౌంటింగ్ కేవలం ఒకసారి మాత్రమే అనుమతిస్తారు.
##########
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z