Politics

అస్సాం సీఎస్‌గా తెలుగోడే

అస్సాం  తెలుగోడే

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్‌ అధికారి కోత రవి అస్సాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అస్సాం కేడర్‌ 1993 బ్యాచ్‌కు చెందిన రవి.. గతంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక దౌత్యాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం అస్సాం ప్రభుత్వంలో 18 శాఖలకు అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఉల్ఫా తీవ్రవాదులతో జరిగిన శాంతి ఒప్పందంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. రవి పనితీరును గుర్తించిన అస్సాం ప్రభుత్వం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. ఈ నియామకంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలఖారులో రవి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z