Business

శంషాబాద్‌ నుంచి రియాద్‌కు నేరుగా విమాన సర్వీసులు

శంషాబాద్‌ నుంచి రియాద్‌కు నేరుగా విమాన సర్వీసులు

శంషాబాద్‌ నుంచి సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు ఫిబ్రవరి 2 నుంచి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లను ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేశామని ఆ సంస్థ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ఉపాధ్యక్షులు తారా నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో శంషాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు బయలుదేరి 3 గంటలకు ఈ విమాన సర్వీస్‌లు రియాద్‌కు చేరుకుంటాయి. తిరిగి అదే రోజు రియాద్‌ నుంచి సాయంత్రం 4 గంటలకు బయదేరి రాత్రి 11 గంటలకు శంషాబాద్‌కు చేరుతాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z