హైదరాబాద్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు ఇక నుంచి నేరుగా విమాన సర్వీసులు నడవనున్నాయి. ఈ మేరకు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో జీఎంఆర్ ఒప్పందం కుదుర్చుకుంది. వారానికి ఐదు రోజుల పాటు (సోమ, మంగళ, బుధ, గురు, శని) ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ళ్753 విమానం హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి 01:55 గంటలకు బయలుదేరి.. 07:05 గంటలకు ఫ్రాంక్‌ఫర్ట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ళ్752 విమానం 10.55 గంటలకు బయల్దేరుతుంది. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో కలసి కొత్త విమాన సర్వీసులు ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పణికర్ అన్నారు. ఈ కనెక్టివిటీ ఫ్రాంక్‌ఫర్ట్‌ను సందర్శించే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే, ఫ్లాంక్‌ఫర్ట్ మీదుగా ఐరోపా, అమెరికా, కెనడా, దక్షిణ అమెరికాలోని వివిధ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ సర్వీసులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
##########
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z