Fashion

ఈ బ్యాగ్ ధర ఇన్ని లక్షలా?

ఈ బ్యాగ్ ధర ఇన్ని లక్షలా?

లగ్జరీ ఫ్యాషన్‌ కంపెనీ లూయిస్‌ విట్టన్‌ రూపొందించిన ఓ శాండ్‌విచ్‌ బ్యాగ్‌ గురించి తాజాగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దాని ధర ఏకంగా రూ.2.80 లక్షలు కావడమే అందుకు కారణం. సాధారణ షాపింగ్‌ బ్యాగ్‌లాగే కనిపించే ఈ శాండ్‌విచ్‌ బ్యాగ్‌ లోపల జిప్డ్‌ పాకెట్‌, డబుల్‌ ఫ్లాట్‌ పాకెట్‌ ఉన్నాయి. మెన్స్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఫారెల్‌ విలియమ్స్‌ దీన్ని రూపొందించారు. జనవరి 4నే ఈ శాండ్‌విచ్‌ బ్యాగ్‌ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సోషల్‌ మీడియాలో వాటి ఫొటోలు వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఏఐ సాంకేతికతో దీన్ని తయారు చేసినట్లున్నారు’ అంటూ ఓ వ్యక్తి కామెంట్‌ చేయగా, ‘ఇలాంటి బ్యాగుల్ని మెక్‌డొనాల్డ్స్‌ కూడా ఇస్తోంది’ అంటూ మరొకరు సరదా వ్యాఖ్య చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z