టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు నగరంలో 10వేల మందికి సంక్రాంతి పండుగ కానుకులు అందించారు. నగర పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిషేధించి ఆంక్షలు విధించనప్పటికీ ఇంటింటికీ వెళ్లి ఈ కానుక అందజేశారు. ఈ కానుకలో వివిధ రకాల నిత్యావసర వస్తువులు పొందుపరిచారు. దీనితో పాటు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు తన మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించామని, భవిష్యత్తులో కూడా చేస్తామని తెలిపారు.
##########
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z