DailyDose

మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

తెలంగాణలోని మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించనున్నారు. 204 పాఠశాలల్లోని ఐదో తరగతి ప్రవేశాలకు ముస్లిం, క్రిస్టియన్‌, పార్శీ, జైన్‌, సిక్కులతో పాటు మైనార్టీయేతర ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మైనార్టీలకు మొదట వచ్చిన వారికి మొదటి సీటు ప్రాతిపదికన, మిగతా వారికి లక్కీడ్రా ద్వారా సీట్లు కేటాయించనున్నట్టు మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయిషా ముసరత్‌ ఖానమ్‌ తెలిపారు.

6 నుంచి ఎనిమిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 194 జూనియర్‌ కాలేజీలు, 10 సీవోఈ కాలేజీల్లో ఇంటర్‌ మొదటి ఏడాదికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. పదో తరగతి జీపీఏ ఆధారంగా జూనియర్‌ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. సీవోఈ కాలేజీల్లో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్టు కార్యదర్శి తెలిపారు. www.tmreistelangana.cgg.gov.in వెబ్ సైట్ లేదా గూగుల్ ప్లేస్టోర్‌లోని TMREIS మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి వెల్లడించారు. అనుమానాలను మైనార్టీ గురుకులాల ప్రధానోపాధ్యాయులు లేదా వెబ్ సైట్‌తో పాటు 040-23437909 హెల్ప్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z