DailyDose

10 లక్షలకు పెంచే యోచన

10 లక్షలకు పెంచే యోచన

ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుపై కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా 10 లక్షల రూపాయల వ్యయం వరకు వైద్యం పొందే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుపై కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నారు. కేన్సర్‌ చికిత్స, అవయవ మార్పిడి తదితరాలకు మరింత వ్యయం అవుతున్న దృష్ట్యా 2024-25 సంవత్సరం నుంచి ఈ కార్డుపై ఆరోగ్య బీమా కవరేజీని రెట్టింపు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z