Politics

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళిసై కీలక నిర్ణయం

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళిసై కీలక నిర్ణయం

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్‌ తమిళిసై నిర్ణయించారు. రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణను గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇద్దరికీ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ తమిళిసై తిరస్కరించారు.

తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్‌ చేస్తూ వారిద్దరూ ఇటీవల హైకోర్టులో పిటిషన్లు వేశారు. పిటిషన్ల విచారణ అర్హతపై ఈనెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. మరో వైపు రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. గవర్నర్‌ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను కేబినెట్‌ ద్వారా ప్రతిపాదించాలని భావిస్తోంది. ఈనేపథ్యంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు బ్రేక్‌ వేస్తూ.. ఖాళీల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. రిట్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో పాటు పెద్దమనుషుల ఒప్పందంపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z