Movies

‘ఓజీ’లో పవన్‌ పాట పాడనున్నారంటూ వస్తోన్న వార్తలపై స్పందించిన తమన్

‘ఓజీ’లో పవన్‌ పాట పాడనున్నారంటూ వస్తోన్న వార్తలపై స్పందించిన తమన్

పవన్‌ కల్యాణ్ (Pawan kalyan) హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’ (OG). గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాపై సంగీత దర్శకుడు తమన్‌ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. ‘‘ఓజీ’ స్క్రిప్ట్‌ ప్రకారం పవన్‌తో పాట పాడించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఆ అవకాశాలను పరిశీలిస్తున్నాం’ అని అన్నారు. దీంతో మరోసారి థియేటర్లలో పవన్‌ పాట వినొచ్చని ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు. జపాన్‌ – ముంబయి నేపథ్యంలో ‘ఓజీ’ కథ ముస్తాబవుతోంది. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా కనిపించనున్నారు. ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ‘ఓజీ’పై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడీ పాట అప్‌డేట్‌తో అవి రెట్టింపయ్యాయి. ఇప్పటివరకు పవన్‌ తన సినిమాల కోసం 9 సార్లు పాడారు. అందులో కొన్ని పూర్తి పాటలు కాగా, ఇంకొన్ని బిట్‌ సాంగ్స్‌. ‘తమ్ముడు’లో ఏం పిల్లా మాట్టాడవా, తాటి చెట్టు ఎక్కలేడు; ‘ఖుషి’లో బయ్‌ బయ్యే బంగారు రవణమ్మ; ‘జాని’లో నువ్వు సారా తాగకురో, రావోయి మా ఇంటికి; ‘గుడుంబా శంకర్‌’లో కిల్లీ కిల్లీ; ‘పంజా’లో పాపారాయుడు; ‘అత్తారింటికి దారేది’లో కాటమ రాయుడా; ‘అజ్ఞాతవాసి’లో కొడకా కోటేశ్వరరావు పాటలు పాడి అలరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z