సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర పరిసరాల్లో వాహనాల రాకపోకలు దారి మళ్లిస్తున్నట్టు ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కె.చక్రవర్తి తెలిపారు. వాహన చోదకుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం వెల్లడించారు.
19న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద 1.35 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో బెంజి సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు బందరు రోడ్డుపై, ఐదో నెంబర్ రూట్‌పై, ఏలూరు రోడ్డు సీతారామపురం జంక్షన్ నుంచి రెడ్ సర్కిల్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి వాటర్ ట్యాంక్ రోడ్డు వరకు అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, ఇతర వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు.
👉 – Please join our whatsapp channel here –