ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ ఓటీటీ వేదికగా విడుదలై ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) సిద్ధమవుతోంది. అభిమన్యు తాడిమేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు.
👉 – Please join our whatsapp channel here –