సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. గజ్వేల్ లో కేసీఆర్ ని ఓడించడానికి చాలా కుట్రలు జరిగాయన్నారు. అందుకోసం 154 నామినేషన్లు వేసి కేసీఆర్ ని ఓడించాలని చూశారు.. గతంలో కేటీఆర్ దావోస్ కి వెళ్తే దండగ అన్నారు.. ఇప్పుడు మీరెందుకు వెళ్లారు అని ఆయన ప్రశ్నించారు. ఇంకో 15 రోజుల్లో గజ్వేల్ క్యాంపు ఆఫీస్ కి మాజీ సీఎం కేసీఆర్ వస్తారు.. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు కావట్లేదు.. అక్కడ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నది అని సర్వేలు చెబుతున్నాయి.. కేసీఆర్ గజ్వేల్ ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ వాళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు.. పీఎసీఎస్ (PACS) చైర్మన్లు, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ లని బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారు అని హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చింది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. చాల హామీలు ఇంకా అమలు కాలేవు.. నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు.. ప్రగతి భవన్ లో 250 రూములు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అని ప్రచారం చేశారు.. బీజేపీతో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ.. కార్యకర్తలపై కేసులు పెడుతే నేను మీ తరపున పోరాడుతాను అని ఆయన పేర్కొన్నారు. నాకు పోలీస్ స్టేషన్ లు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు.. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ పార్టీ ఆపేస్తుంది అని హరీష్ రావు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –