తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పలు జిల్లాల అధ్యక్షులను మార్చింది. పలు జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అలాగే, కొత్తగా ఆరుగురు బీజేపీ మోర్చా అధ్యక్షులను కూడా నియమించింది.
వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ నాయకత్వం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పలు జిల్లాల అధ్యక్షులను మార్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులకు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారమందించారు.
కొత్తగా నియమితులైన ఆరు మోర్చాలా అధ్యక్షులు
ఎస్టీ మోర్చా – కల్యాణ్ నాయక్
ఎస్సీ మోర్చా – కొండేటి శ్రీధర్
యువ మొర్చా – మహేందర్
OBC మోర్చా – ఆనంద్ గౌడ్
మహిళ మోర్చా – డాక్టర్ శిల్పా
కిసాన్ మోర్చా – పెద్దోళ్ల గంగారెడ్డి.
కొత్త అధ్యక్షులు వీరే..
నిజామాబాద్ – దినేష్ కుమార్
పెద్దపల్లి – చందుపట్ల సునీల్
సంగారెడ్డి – గోదావరి అంజిరెడ్డి
సిద్దిపేట – మోహన్ రెడ్డి
యాదాద్రి – పాశం భాస్కర్
వనపర్తి – డి నారాయణ
వికారాబాద్ – మాధవరెడ్డి
నోల్గొండ – డాక్టర్ వర్షిత్ రెడ్డి
ములుగు – బలరాం
మహబూబ్ నగర్ – పీ శ్రీనివాస్ రెడ్డి
వరంగల్ – గంట రవి
నారాయణపేట – జలంధర్ రెడ్డి.
👉 – Please join our whatsapp channel here –