మనుషులు మాట్లాడుకుంటారు.. జంతువులు మాట్లాడుకుంటాయి.. ఎవరి భాష వారికి ఉంటుంది. మరి మొక్కలు మాట్లాడుకోవటం ఎప్పుడైనా చూశారా? అంటే లేదు. కానీ, ఆధారాలతో సహా నిరూపించారు జపాన్ పరిశోధకులు. బయోసెన్సర్ ఆధారంతో మొక్కలు మాట్లాడుకోవటాన్ని వీడియో తీశారు.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సదరు మొక్క పక్కనుండే వేరే మొక్కలతో సంభాషించటాన్ని చిత్రీకరించారు. 1980ల్లోనే మొక్కలు మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్తూవచ్చారు. అయితే, ఇప్పటి వరకు నిరూపించలేదు. జపాన్లోని సైతామా వర్సిటీ పరిశోధకులు.. టమాట మొక్కపై దాడి జరిగే క్రమంలో దానికి ఉన్న ఆకులు కాల్షియం సిగ్నల్స్(హెచ్చరిక సందేశాలు)ను వేరే మొక్కకు చేరవేయటాన్ని గుర్తించారు
👉 – Please join our whatsapp channel here –