టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడితే విజయవాడలో వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని.. 80 శాతం మంది వైసీపీ నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలపై నాని కౌంటర్ ఇచ్చారు. రేపు ఎన్నికల బాక్స్‌లు తెరిచాక ఏ పార్టీ 80 శాతం ఖాళీ అవుతుందో తెలుస్తుందని కేశినేని నాని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన కేశినేని నాని.. పబ్లిసిటీ కోసం మాట్లాడవద్దని.. ఉత్తర ప్రగల్భాలు ఆపితే మంచిదని చిన్నికి హితవు పలికారు.
పేదలను ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశించే నాయకుడు సీఎం జగన్ అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఆనాడు అంబేడ్కర్ పోరాడిన వర్గాల కోసం.. నేడు జగన్ పోరాడుతున్నారని అన్నారు. గతంలో అంబేడ్కర్ విగ్రహాలను ఊరి చివర పెట్టేవారని.. కానీ జగన్ మాత్రం రాష్ట్రం నడిబొడ్డున భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రాజకీయాలు చేయడం టీడీపీకి సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. తాను చంద్రబాబు చిట్టా విప్పితే ఎవరూ తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –