Politics

భీమిలిలో వైసీపీ భారీ బహిరంగసభ

భీమిలిలో వైసీపీ భారీ బహిరంగసభ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అది కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారట.. ఈ నెల 25వ తేదీన భీమిలిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు వైసీపీ రెడీ అవుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 5-6 వేల మందిని తీసుకుని వచ్చేలా పార్టీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం అవుతారని తెలిపారు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి.. భీమిలిలో జరిగే బహిరంగ సభ ద్వారా కేడర్ కు జగన్మోహన్ రెడ్డి దశ దిశ నిర్ధేశం చేస్తారని తెలిపారు. ఇక, పార్టీలో అసంతృప్తులు తొలగించడం, ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం జగనే వివరించి చెబుతారని పేర్కొన్నారు. మొత్తంగా ఐదు ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో వై నాట్‌ 175 అంటూ ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన సీఎం జగన్‌.. ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికలకు పార్టీని గెరప్ చేసే దిశగా రాష్ట్రంలో 5 కేడర్ మీటింగ్ లు పెట్టాలని కూడా వైసీపీ నిర్ణయించింది. తొలి బహిరంగ సభ ద్వారా కేడర్ కు దిశా నిర్ధేశం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ప్లీనరీకి మించి ఈ సభ తలపెట్టారు.. ఒక్కో నియోజకవర్గం నుంచి 6 వేల మంది వరకు పార్టీ కేడర్‌ను తీసుకుని వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z