అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్ భారత మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వెహికిల్ ‘స్పెక్టర్’ విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.7.5 కోట్లు. కంపెనీ నుంచి తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ ఇదే. 5.4 మీటర్ల పొడవున్న ఈ రెండు డోర్ల ఎలక్ట్రిక్ కూపే ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది.
గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో అందుకుంటుంది. 102 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ పొందుపరిచారు. 585 బీహెచ్‌పీ పవర్, 900 ఎన్‌ఎం టార్క్ దీని ప్రత్యేకత. 195 కిలోవాట్ అవర్ చార్జర్‌తో 10 నుంచి 80 శాతం చార్జింగ్ స్థాయికి 34 నిముషాలు పడుతుంది.
50 కిలోవాట్ డీసీ చార్జర్‌తో 95 నిముషాలు పడుతుంది. కారు బరువు 2,890 కిలోలు. ఫోర్ వీల్ స్టీరింగ్, 23 అంగుళాల ఏరో ట్యూన్డ్ వీల్స్ ఏర్పాటు చేశారు. ఆల్ అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పై స్పెక్టర్ రూపుదిద్దుకుంది.
👉 – Please join our whatsapp channel here –