ScienceAndTech

చంద్రయాన్ 3 గురించి మరో అప్ డేట్

చంద్రయాన్ 3 గురించి మరో అప్ డేట్

చంద్రయాన్‌-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు శుక్రవారం బెంగళూరులో ధ్రువీకరించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్‌-3 ల్యాండర్‌లో నాసాకు చెందిన లూనార్‌ రికనిసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ)ను అమర్చారు. ఇందులోని లేజర్‌ రెట్రో రెఫ్లెక్టర్‌ ఎరే (ఎల్‌ఆర్‌ఏ).. జాబిల్లి దక్షిణ ధ్రువంలోని లొకేషన్‌ మార్కర్‌ సేవలను పునరుద్ధరించిందని వివరించారు. డిసెంబరు 12 నుంచి ఎల్‌ఆర్‌ఏ నుంచి తమకు సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది. చంద్రయాన్‌-3లో పలు సంస్థలకు చెందిన ఎల్‌ఆర్‌ఏలను అమర్చినా నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఏ నిరంతరం పనితీరు కనబరుస్తూనే ఉందని తెలిపింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్‌ఆర్‌ఏ పర్యవేక్షణ మొదలవుతుంది. చంద్రయాన్‌-3 నుంచి తూర్పు వైపునకు మళ్లి ఉన్న ఎల్‌ఆర్‌ఓలోని లేజర్‌ అల్టిమీటర్‌ (లోలా) చంద్రయాన్‌-3 ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు అందించగలుగుతుంది. ఇందులోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణానికి అనువుగా ఏర్పాటయ్యాయి. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే సామర్థ్యంతో రూపొందించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z