Devotional

అయోధ్య చేరుకున్న బాహుబలి తాళం

అయోధ్య చేరుకున్న బాహుబలి తాళం

అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో భవ్య రామ మందిరం కోసం తయారు చేసిన వస్తువులు ఒక్కొక్కటిగా అయోధ్యకు చేరుకుంటున్నాయి. తాజాగా రామాలయం కోసం తయారు చేసిన బాహుబలి తాళం అయోధ్య నగరానికి చేరుకుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద తాళం ఇదే కావడం విశేషం. తాళాల నగరంగా పేరున్న ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని అలీగఢ్‌ (Aligarh)కు చెందిన సత్య ప్రకాశ్‌ శర్మ (Satya Prakash Sharma), ఆయన భార్య రుక్మిణీ శర్మ ఈ తాళాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేశారు. రాముడికి అపర భక్తులైన ఈ దంపతులు కొన్ని నెలలపాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన చేతితో తయారుచేసిన తాళాన్ని (world largest handmade lock) సిద్ధం చేశాడు. అయోధ్య ఆలయాన్ని దృష్టిలో ఉంచుకుని 400 కేజీల బరువుతో, పది అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని, నాలుగు అడుగుల చెవిని తయారు చేశారు. మొత్తం రూ.2 లక్షలు ఖర్చు చేసి ప్రపంచంలోనే అతి పెద్ద హ్యాండ్‌ మేడ్‌ తాళాన్ని తయారు చేసినట్లు సత్యప్రకాశ్‌ తెలిపారు. ఇప్పుడు ఈ తాళం అయోధ్య భవ్య రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

సత్య ప్రకాశ్‌ శర్మ (Satya Prakash Sharma) రాముడికి అపరమైన భక్తుడు. అతను వృత్తిరీత్యా తాళాల తయారీలో నిపుణుడు. అతడి కుటుంబం 100 సంవత్సరాలకు పైగా తాళాల తయారీ పనులు చేస్తోంది. ఇందులో భాగంగానే అయోధ్య రామాలయం కోసం సత్యప్రకాశ్‌ శర్మ కొన్ని నెలలపాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన చేతితో తయారుచేసిన ఈ తాళాన్ని (world largest handmade lock) సిద్ధం చేశాడు

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z