Agriculture

ప్రకృతి వ్యవసాయంపై దర్యాప్తు చేస్తున్న బంగ్లాదేశ్ బృందం

ప్రకృతి వ్యవసాయంపై దర్యాప్తు చేస్తున్న బంగ్లాదేశ్ బృందం

ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రతినిధి బృందానికి రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వారికి వివరించారు. ప్రకృతి సాగులో ప్రగతి, ఫలితాలను తెలియజేశారు. పదిహేను మందితో కూడిన బంగ్లాదేశ్‌ బృందం నాలుగు రోజుల పాటు కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పర్యటించనుందని రైతు సాధికార సంస్థ అధికారులు పేర్కొన్నారు. 1.75లక్షల మంది సభ్యత్వం కలిగిన పల్లి కర్మ సహాయ ఫౌండేషన్‌కు(పీకేఎస్‌ఎఫ్‌) చెందిన సీనియర్‌ అధికారులు అకోండ్‌ మొహమ్మద్‌, రఫీకుల్‌ ఇస్లాం, తాఫిక్‌ హుస్సేన్‌షా చౌదురి, ఆఫ్రిన్‌ సుల్తానా, కపిల్‌కుమార్‌ పాల్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z