Kids

సంతానం లేని వ్యక్తి పసిబిడ్డను కిడ్నాప్

సంతానం లేని వ్యక్తి పసిబిడ్డను కిడ్నాప్

సంతానం లేని వ్యక్తి పసిబిడ్డను కిడ్నాప్ చేశాడు. (Childless Man Kidnaps Toddler) ఆ బాబును తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఆ పసి బాబును పోలీసులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆమె భర్తను అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జైత్‌పూర్ ప్రాంతంలో ఒక మహిళ బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తున్నది. ఆమెకు ఇద్దరు పిల్లలు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో 11 నెలల బాబు ఏడ్చాడు. దీంతో పార్లర్‌ బయటకు తీసుకెళ్లి ఆడించాలని ఎనిమిదేళ్ల కుమార్తెకు ఆ మహిళ చెప్పింది.

కాగా, స్కూటర్‌పై వచ్చిన 39 ఏళ్ల వ్యక్తి బ్యూటీ పార్లర్‌ బయట బాలికతో ఉన్న పసి బాబును ఎత్తుకెళ్లాడు. ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఆందోళన చెందిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఒక వ్యక్తి స్కూటర్‌పై పసి బాబును తీసుకెళ్లడాన్ని గమనించారు. ఆ స్కూటర్‌ నంబర్‌ ఒక మహిళ పేరుతో రిజిస్టర్‌ అయ్యిందని గుర్తించారు.

మరోవైపు పసిబిడ్డను అపహరించిన ఆ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. అతడి భార్య ఇది తెలుసుకుని ఆందోళన చెందింది. గురువారం ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. జరిగిన సంగతి చెప్పి పసిబిడ్డను పోలీసులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో పసి బాబును కిడ్నాప్ చేసిన మహిళ భర్త నవీన్ మిశ్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నోయిడాలోని ఒక స్టోర్‌లో అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న అతడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీస్‌ అధికారి తెలిపారు. సంతానం లేకపోవడంతో బాబును కిడ్నాప్‌ చేశాడని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z