రవితేజ నటించిన ‘ఈగల్’ (Eagle) రిలీజ్ డేట్ కోసం నిర్మాణ సంస్థ ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించింది. జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు సంక్రాంతి బరి నుంచి వైదొలిగింది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడు అదే రోజు మరికొన్ని చిత్రాలు విడుదలవుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమకు ఇచ్చిన ‘సోలో రిలీజ్ డేట్’ మాట నిలబెట్టుకోవాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఛాంబర్‌ను కోరింది. తమకు సోలో డేట్ వచ్చేలా సహకరించాలని లేఖ రాసింది.
‘ఈగల్’ (Eagle) విషయానికొస్తే.. వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో రవితేజ విభిన్న పార్శ్వాల్లో కనిపించనున్నారు. ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ నటించారు. నవదీప్, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
👉 – Please join our whatsapp channel here –