NRI-NRT

హైదరాబాద్ నుండి అంతర్జాతీయ విమాన సర్వీసుల జాబితా

హైదరాబాద్ నుండి అంతర్జాతీయ విమాన సర్వీసుల జాబితా

దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. భారత్‌లో నాలుగో అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్, ఎయిర్‌బస్ వంటి ఎమ్మెన్సీల కార్యాలయాలు ఉన్నాయి. ఫలితంగా, ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలు భాగ్యనగరం నుంచి అనేక దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ నిర్వహిస్తున్నాయి. ఇటీవలే జర్మనీ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సా.. రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును ప్రారంభించింది. మరి నగరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని నగరాలకు ప్రస్తుతం డైరెక్ట్ ఫ్లైట్స్‌ ఉన్నాయో ఓమారు చూద్దాం.

హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు ఉన్న అంతర్జాతీయ నగరాలు ఇవే..

దుబాయ్, యూఏఈ

మస్కట్, ఓమన్

దోహా, ఖతర్

అబుధాబీ, యూఏఈ

జెద్దా, సౌదీ అరేబియా

సింగపూర్

కౌలాలంపూర్, మలేషియా

దమ్మామ్, సౌదీ అరేబియా

షార్జా, యూఏఈ

రియాద్, సౌదీ అరేబియా

కువైత్

కొలొంబో, శ్రీలంక

బహ్రెయిన్

లండన్, యూకే

ఢాకా, బంగ్లాదేశ్

హాంకాంగ్

ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ

బ్యాంకాంక్, థాయ్‌ల్యాండ్

మాలే, మాల్దీవులు

రస్ అల్ ఖైమా, యూఏఈ

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z