భారత విమానయాన రంగానికి 2042 నాటికి మరో 2,500కు పైగా విమానాలు అవసరం అవుతాయని బోయింగ్ అంచనా వేస్తోంది. ‘పెరుగుతున్న ప్రయాణికులు, సరుకు రవాణా డిమాండ్‌ను తీర్చడానికి దక్షిణాసియాకు చెందిన విమానయాన సంస్థలు రాబోయే రెండు దశాబ్దాలలో తమ విమానాల పరిమాణాన్ని నాలుగు రెట్లు పెంచుతాయని అంచనా.
వృద్ధి, విమానాల భర్తీని పరిష్కరించడానికి ఈ కంపెనీలకు 2,705 కంటే ఎక్కువ కొత్త విమానాలు అవసరమవుతాయి. ఇందులో 92 శాతం భారత్ కైవసం చేసుకుంటుంది’ అని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ డేరిన్ హస్ట్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు.
అంచనా వేసిన మొత్తం విమానాల్లో.. తక్కువ దూరం ప్రయాణించడానికి అనువైన చిన్న విమానాలు 2,300లకుపైగా, సుదూర ప్రాంతాల కోసం సుమారు 400 విమానాలు అవసరం అవుతాయని చెప్పారు. ఆసియాలో దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పరంగా మహమ్మారి ముందస్తు స్థాయికి పుంజుకున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ, పెద్ద మార్కెట్ భారత్ మాత్రమేనని ఆయన అన్నారు.
👉 – Please join our whatsapp channel here –