Politics

25న కొత్త ఓటర్లకు సత్కారం

25న కొత్త ఓటర్లకు సత్కారం

ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా బూత్‌ లెవల్‌ అధికారి స్థాయిలో కొత్త ఓటర్లను సతరించి, వారికి ఓటర్‌ కార్డులు జారీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ పేర్కొన్నారు. 25న ఉదయం 11 గంటలకు రాష్ట్రస్థాయిలో ఎన్నికల ప్రతిజ్ఞ తీసుకునేలా ఏర్పాటు చేయాలని ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించిందని వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రస్థాయి ఎన్నికల నిర్వహణ యంత్రాంగాన్ని చైతన్యపరచడానికి శుక్రవారం ఉదయం సీఈవో వికాస్‌ రాజ్‌ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవానికి ‘ఓటింగ్‌కు మించినదేదీ లేదు, నేను తప్పక ఓటేస్తాను’ అనే ఇతి వృత్తాన్ని ఎంపిక చేశారని చెప్పారు. 25న కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. బూత్‌స్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించాలని డీఈవోలతో సహా సంబంధిత అధికారులందరికీ వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీచేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటు హకును వినియోగించుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమానికి అదనపు సీఈవో లోకేశ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z