Movies

ఆ షూటింగ్‌ అనుభవాలను పంచుకున్న రష్మిక

ఆ షూటింగ్‌ అనుభవాలను పంచుకున్న రష్మిక

‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise)తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మిక (Rashmika). ఇటీవల ‘యానిమల్‌’ (Animal)తో విజయాన్ని అందుకున్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆ షూటింగ్‌ అనుభవాలను పంచుకున్నారు. ఈసందర్భంగా తన తదుపరి చిత్రాలైన ‘పుష్ప 2’, ధనుష్‌ ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘యానిమల్‌’ (Animal) కోసం రణ్‌బీర్‌ కపూర్‌తో వర్క్‌ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. సందీప్‌ ఆలోచనా విధానం చూసి షాకయ్యా. రణ్‌బీర్‌ను కొట్టే సన్నివేశం నటిగా నాకొక సవాల్‌ అనిపించింది. ఒక్క టేక్‌లోనే ఆ సీన్‌ షూట్‌ చేశాం. సందీప్‌ సీన్‌ను వివరించి.. పరిస్థితిని ఫీలవ్వాలని చెప్పారు. కేవలం ఆ ఒక్క మాటే నాకు గుర్తుంది. యాక్షన్‌, కట్‌ మధ్యలో ఏం జరిగిందో గుర్తు లేదు. రణ్‌బీర్‌ మీద కేకలు వేశా. కోపంతో అతడిని చెంపపై కొట్టా. షాట్‌ ఓకే అని దర్శకుడు చెప్పినా నా కన్నీళ్లు ఆగలేదు. బాగా ఏడ్చేశా. తర్వాత రణ్‌బీర్‌ వద్దకువెళ్లి.. ‘అంతా ఓకేనా’ అని అడిగా. ‘యానిమల్‌’ సీక్వెల్‌ విషయంలో సందీప్‌ ఎంతో క్లారిటీతో ఉన్నారు. పార్ట్‌ 1కు వచ్చిన స్పందనలను దృష్టిలో ఉంచుకుని తను అనుకున్నది స్క్రీన్‌పైకి తీసుకువస్తారు’’

‘‘పుష్ప 2’ గురించి నేను ఒకే ఒక్క మాట చెప్పగలను. మీరు ఊహించిన దానికంటే భారీ స్థాయిలో ఉండనుంది. ‘పుష్ప ది రైజ్‌’ సక్సెస్‌తో మాపై బాధ్యత పెరిగింది. ఇటీవల నేను ఒక పాట షూట్‌లో పాల్గొన్నా. ఇది ముగింపు లేని కథ. మనం అనుకున్నట్లు దీనిని తీర్చిదిద్దవచ్చు. ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఇందులో నా పాత్ర చాలా మెరుగ్గా ఉంటుంది. శేఖర్‌ కమ్ముల – ధనుష్‌ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నా’’ అని ఆమె చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z