DailyDose

రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టుల భర్తీ

రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టుల భర్తీ

నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి స్థాయి ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

కొన్ని ముఖ్యాంశాలివే..

విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే. అంతేకాకుండా ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వాళ్లూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వేతనం: అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ALP) ఉద్యోగానికి ఎంపికైన వారికి తొలుత రూ.19,900 నుంచి వేతనం అందుతుంది. ఇతర సౌకర్యాలు ఉంటాయి.

వయో పరిమితి: దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయస్సు జులై 1, 2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా 21 రైల్వే జోన్‌ల పరిధిలో అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. జోన్‌ల వారీగా పోస్టుల ఖాళీల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షల్లో మెరిట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితర ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z