Politics

రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు 203 కోట్లు విడుదల

రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు 203 కోట్లు విడుదల

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించి, అభివృద్ధి చేయాలని అన్నదాతలు చేస్తున్న ఉద్యమం ఈ నెల 25 నాటికి 1500 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఆ రోజు ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేయడానికి అమరావతి ఐకాస సన్నద్ధమవుతోంది. దీని కోసం రాజధాని 29 గ్రామాల్లోని రైతులు, కూలీలు, మహిళల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడానికి శనివారం మందడం శిబిరంలో ఐకాస సమావేశం నిర్వహించనుంది. 1500వ రోజు ఉద్యమ కార్యాచరణకు ప్రణాళికలు రూపొందిస్తామని ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్నదాతలు.. అమరావతి మద్దతుదారులను కూడగట్టుకొని వైకాపా ప్రభుత్వంపై ఆఖరి అస్త్రాన్ని ఎక్కుపెట్టనున్నారు.

ఎన్నికలకు రూ.203.58 కోట్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.203.58 కోట్లు కేటాయించింది. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు ఈ మొత్తాన్ని కేటాయించింది. పోలింగ్‌ సామగ్రి కొనుగోలు, టీఏ, కార్యాలయాల్లో ఇతరత్రా ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z