అయోధ్య రామ మందిరానికి నటుడు ప్రభాస్ (Prabhas) రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చారని, ప్రారంభోత్సవం నాడు భోజనాల ఖర్చు మొత్తం ఆయనే పెట్టుకోనున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. నెట్టింట వైరల్‌గా మారిన ఈ కథనాలపై ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పింది. వాటిని ఏమాత్రం నమ్మొద్దని కోరింది.
ప్రతిష్టాత్మక రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. సినీ, రాజకీయ, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ప్రభాస్‌కు సైతం ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రూ.50 కోట్లు విరాళం ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భోజనం ఖర్చులు ప్రభాస్ పెట్టుకుంటున్నారని చెప్పారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయా కథనాలపై స్పష్టత కోసం ఆంగ్ల వెబ్‌సైట్ తాజాగా ప్రభాస్ టీమ్‌ను సంప్రదించగా అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టతనిచ్చింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘సలార్’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్‌తో ‘కల్కీ 2898 ఏడీ’ (Kalki 2898 AD), మారుతీతో ‘రాజాసాబ్’ కోసం వర్క్ చేస్తున్నారు. వీటి తర్వాత ‘సలార్ శౌర్యాంగపర్వం’ కోసం సిద్ధం కానున్నారు.
👉 – Please join our whatsapp channel here –