Devotional

Vemulavada:రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Vemulavada:రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulavada Temple) రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు(Huge Devotees) పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ జాతర సమీపిస్తుండటంతో భక్తులు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేకువజామునే భక్తులు స్నానాలు చేసి, రాజన్నకు ప్రీతికరమైన కోడెమొక్కును చెల్లించారు.

పలువురు భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో బారులు తీరి, స్వామివారి దర్శనం చేసుకున్నారు. కాగా, గర్భాలయంలో ఆర్జిత సేవలు, అన్నపూజలను అధికారులు రద్దు చేశారు. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z