సాధారణంగా కితకితలు పెడితే చిన్న వారి నుంచి పెద్ద వారిదాకి పకపకమని నవ్వుతూ ఉంటారు. ఎదుటి వారిని కావాలని ఆట పట్టించాలని ఇలా కితకితలు అనేవి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని నవ్వించడం కోసం ఈ కిత కితలు పెడతారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించారా.. ఎదుటి వారు పెడితేనే కిత కితలు వస్తాయి. మనకు మనం పెట్టుకుంటే అస్సలు రావు. మరి దీనికి కారణం ఏంటి? కితకితలు పెడితే ఎందుకు నవ్వు వస్తుంది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు..
సాధారణంగా కితకితలు పెడితే చిన్న వారి నుంచి పెద్ద వారిదాకి పకపకమని నవ్వుతూ ఉంటారు. ఎదుటి వారిని కావాలని ఆట పట్టించాలని ఇలా కితకితలు అనేవి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని నవ్వించడం కోసం ఈ కిత కితలు పెడతారు.
కానీ ఇక్కడ ఒక విషయం గమనించారా.. ఎదుటి వారు పెడితేనే కిత కితలు వస్తాయి. మనకు మనం పెట్టుకుంటే అస్సలు రావు. మరి దీనికి కారణం ఏంటి? కితకితలు పెడితే ఎందుకు నవ్వు వస్తుంది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కిత కితలకు కారణం మెదడులోని కార్టిక్స్, ఎంటీరియా సిగులేట్ కార్టిక్స్. కితకితలు పెట్టినప్పుడు ఇవి యాక్టీవ్ అవుతాయి. కార్టిక్స్ అనేవి శరీర స్పర్శకు స్పందిస్తాయి. ఎంటీరియా సిగులేట్ కార్టిక్స్ అనేవి సెన్సేషన్, ఆనందాన్ని కలిగిస్తుంది.
మనకు ఎవరైనా కిత కితలు పెడితే మెదడులోని సెరిబెల్మ్ భాగానికి సమాచారం అందుతుంది. అది కార్టిక్స్ కు ఒక సర్‌ప్రైజ్ లాంటిది. కితకితల సమాచారం అందగానే అది.. నవ్వు పుట్టిస్తుంది. ఇలా నవ్వు అనేది ఎక్కువగా వస్తుంది.
అదే విధంగా మనం స్వయంగా కితకితలు పెట్టుకుంటే మాత్రం.. సెరిబెల్మ్ అనేది రియాక్ట్ అవ్వదు. కాబట్టి మనం కిత కితలు పెట్టుకున్నా ఏ మాత్రం స్పందన ఉండదు.. నవ్వు కూడా రాదు. ఇదీ కిత కితల వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం.
👉 – Please join our whatsapp channel here –