Politics

మేడారం జాతరకు అన్ని జిల్లాల అధికారులు మంత్రులు సహకరించాలి

మేడారం జాతరకు అన్ని జిల్లాల అధికారులు మంత్రులు సహకరించాలి

25,28 న మంత్రులు మేడారం జాతరకు రావాలని మంత్రి సీతక్క తెలిపారు. హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనీ 12 అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ములుగు నియోజక వర్గం నుండి సమీక్ష మొదలైంది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రులు కొండ సురేఖ, సీతక్క. ఎమ్మెల్యే లు, కలెక్టర్ లు ఎస్పీలు పాల్గొన్నారు. సీతక్క మాట్లాడుతూ.. జిల్లాలో గోదావరి బెల్టుతో పాటు చిన్న చిన్న వాగులు పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయన్నారు.

జిల్లా అభివృద్ధి నిధులు అధికంగా మంజూరు చేయాలని కోరారు. రామప్ప, లక్నవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత గ్రావిటీ కాలువలు నిర్మాణం కోసం ల్యాండ్ అక్యువేషన్ జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న ల్యాండ్ యాక్టివేషన్ కు డబ్బులు అందించాలన్నారు. మేడారం జాతరకు అన్ని జిల్లాల అధికారులు మంత్రులు సహకరించాలని తెలిపారు. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నియోజక వర్గాల వారీగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల కృషీ కోసం జరగబోయే బడ్జెట్ లో కావలసిన అంశాల పై ఈ కార్యక్రమ ద్వారా ఒక అవగాహన లభిస్తుందన్నారు.

మంత్రులు ఏమన్నారంటే..

పొంగులేటి : 12 నియోజక వర్గాల లో పెండింగ్ లో సమస్యల పరిష్కారం కోసం జరగబోయే బడ్జెట్ లో కేటాయింపుల విషయంలోఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది.

కొండ సురేఖ: అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయం తో సమస్యల పరిష్కారం, నిధుల కేటాయింపుకు ఈ సమావేశం ఉపయోగ పడుతుందన్నారు. నియోజక వర్గాలలో ఎలాంటి సమస్యలు ఉన్న జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటికి, జిల్లా మంత్రుల దృష్టికి తీసుకురావాలన్నారు.

పొన్నం ప్రభాకర్ : ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటగా ములుగు నియోజక వర్గం నుండి ఇరిగేషన్ శాఖపై సమావేశం ప్రారంభ మైందన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z