ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను అంగన్వాడీలు అడ్డుకున్నారు. దీంతో మంత్రి కాన్వాయ్ రోడ్డు పైనే ఆగిపోయింది. కాన్వాయ్‌లో కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కాన్వాయ్‌కు అడ్డంగా బైఠాయించిన అంగన్వాడీలను పోలీసులు తోసిపడేశారు. అంగన్వాడీల ఆందోళనను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన తీరుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అంగన్వాడీల పట్ల పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారు. మహిళ పోలీసులైతే.. అంగన్వాడీల చెంప చెల్లుమనిపించారు. పోలీసుల దాడిలో ఓ అంగన్వాడీ కార్యకర్త తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం కార్యకర్తను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంగన్వాడీల ఆందోళన నేపథ్యంలో శిబిరం వద్దకు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేరుకున్నారు. పోలీసులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల పయ్యావుల కేశవ్ వద్ద అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల పోలీసుల దురుసుగా ప్రవర్తించారంటూ కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు.
👉 – Please join our whatsapp channel here –