ఆసియా క్రీడల్లో పతకాలతో మెరిసిన భారత షట్లర్లు సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్(India Open)లో దుమ్మురేపుతున్నారు. స్టార్ ఆటగాడు హెచ్ హెస్ ప్రణయ్(HS Prannoy) పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లగా.. సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj)- చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అంచనాలకు తగ్గట్టు రాణించి సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం చైనీస్ తైపీ ఆటగాడు వాంగ్ జూ వీతో జరిగిన క్వార్టర్స్‌లో ప్రణయ్ తొలి సెట్ అవలీలగా గెలిచాడు. అయితే.. రెండో సెట్‌లో ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చాడు. కీలకమైన మూడో సెట్‌లో ప్రణయ్ తన మార్క్ ఆటతో వాంగ్‌పై పైచేయి సాధించాడు. మూడు సెట్లలో 21-11, 17-21, 21-18తో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాడు.
HSP🇮🇳 moves into maiden semis of #YonexSunriseIndiaOpen2024 in style💪💯#IndiaKaSmashMania#BWFWorldTourSuper750#IndiaontheRise#Badminton pic.twitter.com/JYzkaxDRRd
— BAI Media (@BAI_Media) January 19, 2024
రెండో సీడ్‌గా ఇండియా ఓపెన్‌లో బరిలోకి దిగిన సాత్విక్- చిరాగ్ ద్వయం క్వార్టర్ ఫైనల్లో రఫ్ఫాడించింది. డెన్మార్క్‌కు చెందిన కిమ్ అస్ట్రుప్, అండెర్స్ రస్ముస్సెన్ జోడీపై అలవోకగా గెలుపొందింది. వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించి 21-7, 21-10తో మ్యాచ్ ముగించింది.
Satwik-Chirag🇮🇳 storm into the semifinal of #YonexSunriseIndiaOpen2024 with roaring crowd support 😎💥💪#IndiaKaSmashMania#BWFWorldTourSuper750#IndiaontheRise#Badminton pic.twitter.com/qEuS4HXlbl
— BAI Media (@BAI_Media) January 19, 2024
‘కిమ్, అండెర్స్‌తో ఎప్పుడూ అంత ఈజీ కాదు. వాళ్లను ఓడించాలంటే టెక్నిక్‌తో పాటు మానసిక సన్నద్ధత చాలా ముఖ్యం. మైండ్ గేమ్‌తో ఈరోజు వాళ్లను బోల్తా కొట్టించాం. మేము ఆడిన విధానంతో చాలా సంతోషంగా ఉన్నాం. రేపు జరుగబోయే మ్యాచ్‌లోనూ జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాం. విజయం కోసం వంద శాతం శ్రమిస్తాం’ అని చిరాగ్ శెట్టి మ్యాచ్ అనంతరం తెలిపాడు.
👉 – Please join our whatsapp channel here –