మహారాష్ట్రలోని మహిళా పోలీసు కానిస్టేబుల్ ఒకరు పురుషుడిగా మారి, ఈ నెల 15న మగబిడ్డకు తండ్రి కాగలిగారు. ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం నుంచి అమనుతి సాధించగలగడంతో లలితా సాల్వే అనే కానిస్టేబుల్ 2018లో వార్తల్లోకి ఎక్కారు. 1988లో పుట్టిన ఆమె 2010లో మహిళా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తన శరీరంలో మార్పులు వస్తున్నట్లు 2013లో గుర్తించారు. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పురుషుల్లో ఉండే వై క్రోమోజోములు ఆమెలో ఉన్నట్లు బయటపడింది. లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. 2018-2020 మధ్య మూడు శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. పేరును లలిత్‌గా మార్చుకున్నారు. సీమా అనే మహిళను 2020లో పెళ్లి చేసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z