NRI-NRT

పార్లమెంట్ ఎన్నికల్లో భారాసకు ఆనవాళ్లు ఉండవు

పార్లమెంట్ ఎన్నికల్లో భారాసకు ఆనవాళ్లు ఉండవు

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ను ఆనవాళ్లు లేకుండా 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి శుక్రవారం లండన్‌లో నిర్వహించిన ‘ఇండియా డయాస్పోరా ఆర్గనైజేషన్స్‌ మీట్‌’కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడొద్దని, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలనుకుని బయలుదేరానని కానీ ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు చూశాక తాను స్పందిస్తున్నానని అన్నారు. మంచి పనులకు ఎవరు పునాదిరాయి వేసినా వాటిని కొనసాగించడానికి తం ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. తాము సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని రేవంత్ అన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టి 20 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్నానని ఇది వంశపారంపర్యంగా రాలేదని అన్నారు. పక్క రాష్ట్రాలతో పోటీపడాలన్న ఆలోచన తమది కాదని, ప్రపంచంతోనే పోటీపడతామని అన్నారు. తెలంగాణ శక్తి, వారసత్వ సంపదకు ప్రవాసులే ప్రచారకులని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని లండన్‌లోని ఎన్నారైలను కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసే దిశలో పనిచేస్తామని చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీ నిషాన్‌ (ఆనవాళ్లు) లేకుండా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతానని భారాస నేతలను హెచ్చరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z